ఎండాకాలంలో ఇంట్లో పెంచే మొక్కలను జాగ్రత్తగా చూసుకోవాలి. మొక్కలను ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తూ ఉండాలి. ఎండిన ఆకులను వెంటనే తొలగించాలి. కుండీలు, మొక్కల మొదల్లో మట్టి ఎండినట్టు అనిపిస్తే వెంటనే నీరు పోయాలి. నెలకు ఒకసారైనా ఎరువుల రసాన్ని నీటిలో కలిపి మొక్కలకు అందించాలి. అలాగే రెండు చుక్కల వేప నూనె నీళ్లలో కలిపి పిచికారీ చేయడం వల్ల తెగుళ్ల సమస్య ఉండదు. రెండు వారాలకు ఒకసారి మొక్క స్థలాన్ని మార్చాలి.