శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోడానికి రోజు ఒక 'కివి' పండు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వర్షాకాలంలో సీజనల్ జబ్బుల నుంచి రక్షించుకోవడానికి కివి ఎంతో సాయపడుతుందంటున్నారు. ముఖ్యంగా డెంగ్యూ రోగుల్లో ప్లేట్లెట్ కౌంట్‌ను పెంచడంలో కివి అద్భుతంగా పని చేస్తుందని చెబుతున్నారు. కివీ పండులో విటమిన్ సి, ఇ, సి, కె, ఎ, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. కివి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.