చాలా మంది చేతి గోళ్లపై తెల్లటి మచ్చలు ఉంటాయి. క్యాల్షియం లోపం వల్ల ఇలాంటి తెల్లటి మచ్చలు, అడ్డ గీతలు వస్తాయి. జింక్ లోపం వలన గుండె సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, ఎముకల సమస్యలు మొదలైనవి తలెత్తే అవకాశం ఉంది. వెల్లుల్లి, బీన్స్, నట్స్, గుమ్మడి గింజలు, బ్రౌన్ రైస్, ఓట్స్, పాలకూర, పుట్టగొడుగులు, బ్రోకలీ, డార్క్ చాక్లెట్, చికెన్, మటన్, పాల ఉత్పత్తుల్లో జింక్ మెండుగా లభిస్తుంది. కావున వీటిని తినాలి.