పలమనేరు మండలంలోని మండిపేట కోటూరుకు చెందిన ఓ వ్యక్తి రైల్వేలో ఉద్యోగినని గ్రామస్థులను ఏమార్చాడు. పలువురికి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ. వేలల్లో డబ్బులు వసూళ్లు చేసి కనిపించకుండా పోయాడు. బాధితులు అతడి నంబర్ కు ఫోన్ చేయగా పని చేయలేదు. అనుమానం వచ్చి విచారించడంతో అతనో మోసగాడని తెలిసింది. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పలమనేరు సీఐ చంద్రశేఖర్‌కు ఫిర్యాదు చేశారు.