మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆదివారం కడప జిల్లా ఎస్పీని కలిశారు. యువగళం పాదయాత్ర సజావుగా సాగడానికి తగిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఇటీవల ప్రొద్దుటూరులో జరిగిన యువగళం పాదయాత్రలో స్థానిక ఎమ్మెల్యే అనుచరులు లోకేష్ మీద దాడి చెయ్యడం హేయమైన చర్య అన్నారు. ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడిన వారి మీద చర్యలు తీసుకోవాలని ఎస్పిని కోరినట్టు తెలిపారు.