వాతావరణ మార్పులతో చాలామందికి కడుపు నొప్పి సమస్య వేధిస్తుంటుంది. అధిక ఉష్ణోగ్రతలతో జ్వరం, అతిసారం, అలసట, అజీర్ణం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ క్రమంలో కాలానుగుణంగా ఆహారాలు తీసుకోవాలి. ఫైబర్ ఉండే పదార్ధాలు తీసుకోవాలి. పైనాపిల్, నారింజ, ప్రోటీన్ పుష్కలంగా ఉండే క్వినోవా, విటమిన్ ఇ అధికంగా ఉండే బాదం వంటివి తీసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సరిగా ఉండేలా చూసుకోవాలి.