ఏపీలో ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ ఫలితాలను మంగళవారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు తెలిపారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల జనరల్, ఒకేషనల్ ఫలితాలు విడుదల చేస్తామని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు www.bie.ap.gov.in వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చని సూచించారు.