లవంగాలను సాధారణంగా వంటల్లోకి ఉపయోగిస్తారు. అయితే వీటిని పరగడుపున తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో లవంగాలను నమిలితే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని పరగడపున తీసుకుంటే రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. పంటినొప్పి ఉన్నవారు లవంగం తీసుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది. తలనొప్పి వచ్చినప్పుడు కేవలం లవంగం నూనె వాసన చూస్తే చాలు తలనొప్పి తగ్గుతుంది.