జగన్ రెడ్డి పరిపాలనలో లక్షల కోట్ల అవినీతి తప్ప మరేమి కనిపించటం లేదంటూ సాక్షాత్తు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆదివారం విశాఖలో ప్రకటించటం రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా వుందో ప్రజలు అర్ధం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా విమర్శించారు. సోమవారం ఆయన మండల కేంద్రం భట్టిప్రోలు లో విలేకర్లతో మాట్లాడుచూ జగన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన కేంద్ర మంత్రి ఆమేరకు దర్యాప్తు చేయించి, చర్యలు ఎందుకు తీసుకోలేదని, ముఖ్యమంత్రి తీసుకుంటున్న అప్రజాస్వామిక విధానాలపై ఒక్కసారైనా కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించిందా అంటూ ఆయన అన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి ప్రకటనలకు విలువుండదని, అవినీతిని ప్రశ్నించిన కేంద్ర ప్రభుత్వం తక్షణమే కేంద్ర దర్యాపు సంస్థలతో విచారణ జరిపించాలని, ఒక ప్రక్క రాష్ట్రానికి రెండు చేతులతో అందిస్తున్న కేంద్ర సహాయం నిలుపుదల చేసి, దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేసారు.
కేంద్ర మంత్రిగా రాజకీయ విమర్శలకు విలువుండదని, కేంద్రం ఇచ్చిన 5 లక్షల కోట్లు ఏమయ్యాయో తెలియని స్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉందని అమిత్ షా చేసిన ఆరోపణలపై విచారణ చేయించి, చర్యలు తీసుకుంటే కేంద్ర మంత్రి ఆరోపణలకు విలువుంటుందన్నారు. రాష్ట్రంలో వైసీపీ నాయకుల భూదందాలు, మైనింగ్, గంజాయి స్మగిలింగ్, తదితర అక్రమాలు రాష్ట్రంలో పెరిగిపోయాయని, ముఖ్యమంత్రి అసమర్ధ పరిపాలనలో రాష్ట్రం విధ్వంసం చెందిందని, అన్ని చూసి, తెలిసి మిన్నకున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని, అలాగే బీజేపీ, వై సీపీ కి లోపాయికారి అవగాహనున్నట్లు ప్రజలు చర్చించు కుంటున్నారన్నారు. అవినీతి నిజం నిగ్గు తేలాలన్న, ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించి, చర్యలు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధి, చేసిన ఆరోపణలు ఋజువు అవుతాయని అన్నారు.