పొన్నూరు మండల పరిధిలోని సీతారాంపురం గ్రామంలో మంగళవారం ఉపాధి హామీ పనులు ప్రారంభమయ్యాయి. గ్రామంలోని ఉదయం ఆరు గంటలకే కూలీలు గ్రామ శివారులోని నండూరు ఛానల్ పూడికతీత పనులు ప్రారంభించారు. గ్రామ శివారు చెరువు మట్టి పనులు చేశారు. ఉపాధి హామీ పనుల కొలతలు కూలీల మస్టర్లను టెక్నికల్ అసిస్టెంట్ రత్నరాజు పర్యవేక్షించారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పనులు కల్పిస్తామని రత్న రాజు పేర్కొన్నారు.