చాలామందిని చెవి నొప్పి బాధిస్తుంటుంది. కొన్ని చిట్కాలు పాటించటం ద్వారా ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. చెవి నొప్పి తగ్గించడానికి ఆలివ్ ఆయిల్ మంచి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. చెవి నొప్పి బాగా ఉన్నప్పుడు ఆలివ్ ఆయిల్ ను వేడిచేసి గోరు వెచ్చగా ఉన్నప్పుడు చెవిలో రెండు చుక్కలు వేయాలి. దీంతో నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. చెవి నొప్పిని తగ్గించడంలో ఉప్పు కూడా ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో ఉప్పు వేసి గోరువెచ్చగా వేయించి, దానిని ఒక మెత్తటి బట్టలో వేసి మూటకట్టుకోవాలి.ఈ ఉప్పు మూటతో నొప్పి ఉన్న చెవి చుట్టూ కాపడం పెట్టుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.