అధిక బరువుతో బాధపడే వారు ఉదయాన్నే కొన్ని అలవాట్లను దినచర్యలో భాగం చేసుకోవాలి. ఈ అలవాట్లను క్రమం తప్పకుండా పాటిస్తే వేగంగా బరువు తగ్గవచ్చు.
- ఉదయన్నే నిద్ర లేవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల బరువు అదుపులోకి వస్తుంది.
- ప్రతిరోజూ ఉదయం 10-15 నిమిషాలు ధ్యానం చేయాలి. దీంతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది.
- బ్రెష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. శరీరంలోని కొవ్వును కరిగించడంతోపాటు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
- అధిక ప్రోటీన్ అల్పాహారం తీసుకోవాలి. తీవ్రమైన వ్యాయామంతో శరీరం అలసిపోతుంది. తక్కువ మోతాదులో ఎక్కువ ప్రోటీన్ ఉండేలా అల్పాహారం తీసుకోవాలి.