కొంతమందికి ఎంత ప్రయత్నింటినా గడ్డం అనేది అస్సలు రాదు. ఈ సమస్య తలెత్తడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే ఒక చిన్న ఇంటి టిప్ ను ఉపయోగించి గడ్డం, మీసం సరిగ్గా పెరిగేలా చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలో టీ స్పూన్ కలబంద గుజ్జును తీసుకొని, ఈ గుజ్జులో ఒక విటమిన్ ఇ క్యాప్సుల్స్ ను వేయాలి. తరువాత ఈ రెండింటిని బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కొద్దిగా మీసం, గడ్డం ఉండే చోట చర్మం పై రాసుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమం చర్మంలోకి ఇంకేలా మర్దనా చేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని గంటన్నర నుండి రెండు గంటల పాటు అలాగే ఉంచిన తరువాత చల్లటి నీటితో లేదా గోరు వెచ్చని నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా వాడడం వల్ల గడ్డం, మీసం పెరుగుదలలో వచ్చే మార్పును మనం గమనించవచ్చు.