ఖాళీ కడుపుతో ఉదయాన్నే ఎండు కొబ్బరి తింటే అనేక అనారోగ్య సమస్యలు దరి చేరవని వైద్య నిపుణులు చెబుతున్నారు. పరిగడుపున ఎండు కొబ్బరి తినడం వల్ల గుండె, మెదడు ఆరోగ్యానికి చాలా మంచిదట. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్-బి పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కూడా ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రక్తహీనతను తగ్గించి హిమోగ్లోబిన్‌ని కూడా పెంచుతుంది.