బరువు తగ్గాలని అనుకునే వారికి ఫ్రూట్స్‌లో ది బెస్ట్ ఆప్షన్ స్ట్రాబెర్రీస్ అని వైద్యులు చెబుతున్నారు. స్ట్రాబెర్రీస్‌లో ఉండే ఫైబర్ పొట్టలో ఉండే కొవ్వును కరిగించేస్తుంది. ఇందులో 91 శాతం నీరు ఉంటుంది. ఓ గిన్నెడు స్ట్రాబెర్రీస్ తిన్నట్లయితే ఆకలి కూడా వేయదు. అడిపొనెక్టిన్, లెప్టిన్ అనే హార్మోన్లను స్ట్రాబెర్రీస్ ఉత్పత్తి చేస్తాయి. ఇవి శరీరంలో కొవ్వును కరిగించేందుకు దోహదపడతాయి. మెటబాలిజంను కూడా పెంచుతుంది. వర్కౌట్స్ చేసిన తర్వాత స్ట్రాబెర్రీస్ తిన్నట్లయితే శరీరంలో వేడిని వెంటనే తగ్గిస్తుంది.