Life style | Suryaa Desk | Published :
Mon, Jun 19, 2023, 12:14 PM
సాధారణంగా జీలకర్రను వంటల్లో ఉపయోగిస్తుంటారు. అయితే జీలకర్రతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాసిన్ని నీళ్లలో జీలకర్ర వేసుకొని తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ జీలకర్ర వాటర్ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యతో బాధపడేవారు జీలకర్ర నీళ్లు తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. వీడిని తాగడం వలన గొంతునొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. జీలకర్ర నీళ్లు కిడ్నీల ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. అంతేకాకుండా మధుమేహంతో బాధపడేవారు వీటిని తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com