రోజురోజుకి అందరూ తమ కార్యకలాపాలలో బిజీ అవుతున్నారు. ఇక ఉద్యోగులైతే చెప్పనక్కర్లేదు. పని ఒత్తిడిలో పడి తమ ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. అయితే శ్వాసక్రియకు సరైన సమయం కేటాయించకపోతే అనేక రోగాల బారిన పడుతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం, తలనొప్పి, మైగ్రేన్, నిద్రలేమి వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది. వీటిని దూరం చేయాలంటే సుదీర్ఘమైన శ్వాసను గంటకు 5 సార్లు తీసుకోవాలంటున్నారు.