డిజిటల్ వినియోగం, అలాగే స్మార్ట్ ఫోన్ లు ఎక్కువగా వాడటం, సమయపాలన లేకుండా గంటలు గంటలుగా వీక్షించడం వలన కంటిలో ఉండే సన్నని నరాలు బలహీన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కంటిని సురక్షితంగా కాపాడుకోవాలంటే కనీసం గంట/ రెండు గంటలకు ఒక్కసారి చల్లని నీటితో కళ్ళను కడుక్కోవాలి. అలాగే పడుకునే ముందు కాస్త ఆముదం/ కొబ్బరి నూనెతో చిన్నగా మసాజ్ చేసుకొని 6 గంటల నిద్ర పోతే సరిపోతుందని అంటున్నారు.