కొత్తిమీరలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీర రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించి మధుమేహ ముప్పును నివారిస్తుందట. కొత్తిమీర ఆకులు, విత్తనాలు థైరాయిడ్ వ్యాధుల నుంచి ఉపశమనం కల్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎండోక్రైన్ గ్రంధి థైరాయిడ్ హార్మోన్ల స్థితిగతులు, జీవక్రియలను నియంత్రిస్తుంది. కొత్తిమీరలో ఉండే యాంటీఆక్సిడెంట్లు థైరాయిడ్ వంటి వ్యాధుల నుంచి మన శరీరాన్ని కాపాడతాయి. ఇంకా కొత్తిమీరను తరచూ తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడంతో పాటు, బరువు తగ్గడం వంటి ఎన్నోఉపయోగాలున్నాయి.