ప్రతీ ఒక్కరికి కలలు రావడం సహజం. అయితే వీటిలో కొన్ని మంచివి ఉంటే.. మరికొన్ని భయకరంగా ఉంటాయి. ఏదో జరుగుతున్నట్లు, దెయ్యాలు, భూతాలు చుట్టేసినట్లు, చనిపోయినట్లు పీడకలలు వస్తుంటాయి. అయితే ఈ పీడకలలు ఎందుకు వస్తాయో ఎవరికీ తెలియదు. పీడకలలు రావడానికి ప్రధాన కారణం ఒత్తిడి అని నిపుణులు చెబుతున్నారు. మన శరీరం, మనసు బాగా అలసిపోయినప్పుడు పీడకలలు వస్తాయన్నారు. ట్రామా, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్‌తో బాధపడే వారికి ఎక్కువగా పీడకలలు వస్తుంటాయని వారు తెలిపారు.