వయసు పైబడే కొద్ది అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందుకే చాలా మంది 50 ఏళ్లు దాటినా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు. కానీ అదంతా సులువు కాదు. ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ప్రతి రోజూ పోషకాలు అధికంగా ఉండే తృణధాన్యాలు, గింజలను ఆహారంగా తీసుకోవాలి. అలాగే రోజూ 10 వేల అడుగులైన నడవాలి. అప్పుడే మీరు ఫిట్‌గా ఉంటారు. ధ్యానం, యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. వీటి ద్వారా మానసిక ఒత్తిడి, మనసుకు ప్రశాంతత లభిస్తుంది.