ఆవ నూనె వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రీయంగా రుజువైంది. ఆవ నూనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మన శరీరంలోని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌ను నివారిస్తుంది. అలాగే పెద్దప్రేగు, జీర్ణవ్యవస్థ మూత్ర నాళాలను ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. అలాగే మన జట్టు ధృడంగా ఉంచేలా సహాయపడుతుంది. ఆవ నూనెలో విటమిన్లు ఏ, ఈ, కాల్షియం, బీటా కెరోటిన్, ఆల్ఫా ఒమేగా 3, ఆల్ఫా ఒమేగా 6, ఇనుము, మాంగనీస్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి.