మన శరీరంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అయితే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఫుడ్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల హార్ట్ బీట్ సరిగ్గా ఉండేందుకు సాయపడుతుంది. అలాగే చేపలు రెగ్యులర్ గా తింటే వీటిలో ఉండే ఫ్యాట్ యాసిడ్స్, ప్రొటీన్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చుతాయి.