ప్లేట్‌లెట్స్ పెరగాలంటే విటమిన్ ఏ, కే, బీ 12, సీ, కే, ఐరన్, విటమిన్ సీ అధికంగా ఉండే ఆహారాలు తినాలి. క్యారెట్, గుమ్మడికాయ, కాలే, చిలగడదుంపలను తినాలి. నారింజ రసం, బచ్చలికూర, తోటకూర, ఇతర ఆకు కూరలను ఆహారంలో చేర్చుకోవాలి. గుడ్లు, కాలేయం, మాంసం, క్యాబేజీ, పార్స్లీ తినాలి. మామిడిపండ్లు, బ్రోకలీ, పైనాపిల్, టమాటలు, బెల్ పెప్పర్స్, కాలీఫ్లవర్, ఇండియన్ గూస్‌బెర్రీ లేదా ఉసిరికాయలను తినాలి. బొప్పాయిని ఆహారంలో భాగం చేసుకోవాలి. బొప్పాయి ఆకుల రసాన్ని తాగాలి. ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవాలి.