ఇండక్షన్ స్టవ్ విద్యుత్‌తో పనిచేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు దీనిని చెక్క టేబుల్ పైన పెట్టడం మంచిది. అంతేకాకుండా సిరామిక్ టైల్స్, సిమెంట్ ఫ్లోర్ పైన కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ స్టవ్‌ని మెటల్ టేబుల్ పైన మాత్రం పెట్టకూడదు. దీనివల్ల షాక్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇండక్షన్ స్టవ్‌ని గ్యాస్ స్టవ్ పక్కన పెట్టకూడదు. స్టవ్‌కి దగ్గరలో ఎటువంటి లోహసామగ్రిని ఉంచకూడదు.