తిరువూరు పట్టణం సమీపంలోని రాజీవ్ నగర్ లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పిడిఎఫ్ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. పిడిఎస్ డిటి శ్వేత మాట్లాడుతూ జిల్లెల్ల నాగరాజు నివాసంలో అక్రమంగా 500 కిలోల రేషన్ బియ్యం నిల్వ ఉందని సమాచారం రావడంతో ఉన్నతాధికారుల ఆదేశానుసారం తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. బియ్యం సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కొత్తపల్లి వీఆర్వో శాంతన్ కుమార్ పాల్గొన్నారు.