ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మణిపూర్ లో జరిగిన సంఘటనపై ఇబ్రహీంపట్నం పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పాస్టర్స్ మరియు క్రైస్తవ సంఘాల సభ్యులు కలిసి సోమవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా క్రిస్టియన్ మైనారిటీ కోఆర్డినేటర్ ఎలీషా మాట్లాడుతూ మణిపూర్ లో క్రైస్తవులకు రక్షణ కల్పించాలని, ప్రాణ భయంతో మణిపూర్ ని వదిలి అస్లాం తలదాచుకుంటున్న వారికి మరియు ఆస్తులు రక్షణ కల్పించి, పునర్వాసం కల్పించాలని, అల్లరి ముకలపై ఉక్కు పాదం మోపి, దాడులను అణిచివేయాలని దాడులకు నిరసనగా సంఘీభావం తెలియజేస్తూ శాంతి ర్యాలీగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి సీఐ కి మరియు తాసిల్దార్ కి వినతి పత్రం అందించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం అందించారు.