ఏపీలోని పలు నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి పరీక్ష తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఆగస్టు 18న ఏపీ టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష, ఆగస్టు 19న సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబార్డినేట్ లో కంప్యూటర్ డ్రాఫ్ట్ మన్, ప్రివెంటివ్ మెడిసన్, ల్యాబ్స్ అండ్ ఫుడ్ సబ్ సర్వీస్ లోని శాంపిల్ టేకర్ పరీక్ష, ఆగస్టు 21న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది.