చల్లని వాతావరణంలో చర్మానికి ఐస్ ముక్కలతో మసాజ్ చేసుకుంటే మంచిదేనా అంటే.. నిర్మొహమాటంగా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. స్కిన్ ఐసింగ్ వల్ల చర్మం తక్షణ కాంతిని పొందుతుంది. డ్రై స్కిన్‌ను నిగారింపు తెస్తుంది. ముఖంపై జిడ్డు వదులుతుంది. మొటిమల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. చర్మరంధ్రాలు శుభ్రమవుతాయి. ఐస్‌ని నేరుగా చర్మం మీద ఉంచకుండా సన్నని గుడ్డలో చుట్టి పెట్టుకోవాలి.