ఏపీలో పెనాల్టి లేకుండా అదనపు పొగాకు కొనుగోలుకు కేంద్రం అనుమతిచ్చింది. ఈ సంవత్సరం 142 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలుకు అనుమతి ఉండగా, 172 మిలియన్ కిలోలు ఉత్పత్తి అయింది. అనుమతికి మించి ఉత్పత్తి చేసే పొగాకును 5 శాతం పెనాల్టీతో కొనేందుకు కేంద్రం అనుమతిస్తుంది. కాగా, పెనాల్టీ లేకుండా కొనుగోలు చేసేందుకు అనుమతివ్వాలని సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాయడంతో, నేటి నుండి పెనాల్టీ లేకుండా కొనేందుకు కేంద్రం అనుమతిచ్చింది.