ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుండి అల్లూరి జిల్లా పాడేరు, వైఎస్సార్ జిల్లా పులివెందుల, కర్నూలు జిల్లా ఆదోని మెడికల్ కాలేజీల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికోసం ఒక్కో మెడికల్ కాలేజీకి 222, బోధనాస్పత్రికి 484 చొప్పున మొత్తం 2,118 పోస్టులను సృష్టించింది. ఈ పోస్టులను మంజూరు చేస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.