సోయాబీన్ నూనెను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చాలా అనర్ధాలున్నాయని తేలింది. స్థూలకాయం, మధుమేహం, ఆటిజం, అల్జీమర్స్ వంటివి తలెత్తుతాయని, పెద్ద పేగుకు సంబంధించిన వ్యాధులు వస్తాయని వెల్లడైంది. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, రివర్‌సైడ్‌లోని పరిశోధకుల ఎలుకలపై చేసిన పరిశోధనలో ఈ విషయాలు స్పష్టమయ్యాయి. వారి పరిశోధనలో సోయాబీన్ నూనె వాడకంతో హానికరమైన బాక్టీరియా శరీరంలో చేరుతున్నట్లు గుర్తించారు.