ఆరోగ్యకరమైన శరీరానికి స్నానం చేయడం చాలా ముఖ్యం. శరీర అవయవాలను సరిగ్గా కడగకపోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదముంది. స్నానం చేసేటప్పుడు అండర్ ఆర్మ్స్ శుభ్రపరుచుకోవాలి. మోకాలు, మోచేతులు సరిగ్గా శుభ్రం చేసుకోవాలి. లేకుంటే చర్మం పొడిబారుతుంది. తొడ మరియు చుట్టపక్కల చర్మం శరీరం యొక్క అత్యంత సున్నితమైన భాగాలు. అలర్జీలు, దురద వచ్చే ప్రమాదం ఉంటుంది. కాలి వేళ్లు, ముక్కు, చెవి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.