ట్విట్టర్‌కు పోటీగా మెటా సంస్థ థ్రెడ్స్ యాప్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. లాంఛ్ చేసిన ఏడు గంటల్లోనే కోటి మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు జుకర్‌బర్గ్ అఫీషియల్‌గా ప్రకటించారు. అయితే ట్విట్టర్, థ్రెడ్స్‌కు ఉన్న తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. థ్రెడ్స్‌లో ఐదు నిమిషాల లాంగ్ వీడియో, ట్విట్టర్‌లో రెండు నిమిషాల 20 సెకన్ల వీడియో పోస్ట్ చేయవచ్చు. ట్విట్టర్‌లో ట్రెండింగ్ టాపిక్స్‌కు సపరేట్ ట్యాబ్ ఉంది. కానీ థ్రెడ్స్‌కు ఆ ఫీచర్ లేదు. అలాగే ట్విట్టర్‌లో ఉన్నట్లు థ్రెడ్స్‌లో పోస్టులను సేవ్ చేసుకోవచ్చు.