కర్ణాటక ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఓ హిందూ వ్యక్తి బస్సులో ఉచితంగా ప్రయాణించడానికి బుర్ఖా ధరించాడు. బుర్ఖా ధరించి బస్టాప్‌లో కూర్చున్న వీరభద్రయ్య మఠాపతిని చూసిన కొందరికి అనుమానం కలిగింది. వారు అతడిని ప్రశ్నించగా తాను భిక్షాటన కోసం బుర్ఖా ధరించినట్లు చెప్పుకొచ్చారు. అతడి వద్ద మహిళ ఫోటో ఉన్న ఆధార్ కార్డు కూడా లభించడంతో సందేహాలు మరింత బలపడ్డాయి.