వర్షాకాలంలో గాలిలో తేమ పెరగడం వల్ల చుండ్రు సమస్య వస్తుంది. దీని వల్ల దురద, జుట్టు పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య పరిష్కారమవ్వాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. తల స్నానం చేసిన తర్వాత టవల్‌తో జుట్టును సున్నితంగా తుడుచుకోవాలి. మాడును పొడిగా ఉంచుకోవాలి. యాంటీ డాండ్రఫ్ షాంపుతో జుట్టును తరచూ వాష్ చేసుకోవాలి. కెటోకానజోల్, జింక్, పైరిథియోన్, సెలీనియం సల్ఫైడ్ ఉండే షాంపులు వాడాలి. స్ట్రెయిట్‌నర్లు, బ్లో డ్రైయర్లు వంటి హీట్ స్టైలింగ్ టూల్స్ వాడకూడదు.