national | Suryaa Desk | Published :
Sun, Jul 09, 2023, 08:05 AM
ఇద్దరు దళిత బాలికలను కిడ్నాప్ చేసి వారం రోజులపాటు అత్యాచారం చేశారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని లాతేహర్ జిల్లాలో చోటు చేసుకుంది. బరవాడీహ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. ఈ మేరకు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు గ్వారాకు చెందిన వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. ప్రత్యేక బృందాలతో దాడులు జరిపి నలుగురు కామాంధులను అరెస్ట్ చేశారు. తమను ఓ ఇంట్లో బంధించి పలుమార్లు అత్యాచారం చేసినట్లు బాలికలు తెలిపారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com