సాధారణంగా అన్నం వండే ముందు బియ్యాన్ని తప్పనిసరిగా కడుగుతారు. బియ్యంలో ఉంటే రాళ్లు, దుమ్ము, సూక్ష్మజీవులు పోవడానికి కడుగుతుంటారు. అయితే బియ్యం కడగటం వల్ల అందులోని బయో యాక్సిసిబుల్ ఆర్సెనిక్ 90 శాతం తగ్గుతుందని తాజా అధ్యాయనంలో తేలింది. అలాగే కొన్ని రకాలు బియ్యం బంకగా ఉంటాయని, అందుకే బియ్యాన్ని కడుగుతారన్నారు. బియ్యాన్ని కడగటం వల్ల ఇనుము, జింకు, రాగి వంటి పోషకాలు బయటకు పోతాయని నిపుణులు చెబుతున్నారు.