వెంట్రుకల సమస్యలకు ప్రధాన కారణం పోషకాహారలోపం. ప్రతి మహిళలోనూ ఈ లోపం ఎంతో కొంత ఉంటూ ఉంటుంది. కుటుంబానికంతటికీ తినిపించి, తాము తినడం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు మహిళలు. దీనికితోడు ప్రతినెలా నెలసరి ద్వారా జరిగే రక్త నష్టం భర్తీకాదు.ఫలితంగా వాటి ప్రభావం వెంట్రుకల మీద పడుతుంది. వెంట్రుకలు పలుచబడడం, ఊడిపోవడం, నిర్జీవంగా తయారవడం లాంటి సమస్యలన్నీ కనిపిస్తాయి. ఈ లోపం సరిదిద్దుకుంటే జుట్టు సమస్య సమసిపోతుంది.