వర్షాకాలంలో ఉదర సంబంధిత రుగ్మతలు పెరుగుతాయి. కలుషితమైన నీరు, ఆహారం వల్ల అజీర్తి, వికారం, జీర్ణ సమస్యలు వస్తాయి. దీనికి వైద్యులు కొన్ని చిట్కాలు చెప్పారు. వీలైనంతవరకు శుభ్రమైన నీటిని తాగాలన్నారు. కాచిన నీరు ఇంకా మంచిదన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఇంట్లోకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లు రావన్నారు. పూర్తిగా ఉడికిన వంటలను ఆహారంగా తీసుకోవాలన్నారు. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని, మసాలా వంటకాలు, కారంపొడులు తగ్గించుకోవాలన్నారు.