తెలంగాణలో నేడు స్కూళ్లు, కాలేజీల బంద్కు ఏఐఎస్ఎఫ్ పిలుపునిచ్చింది. రాష్ట్రంలో విద్యా రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని, బడ్జెట్లో విద్యకు తగిన నిధులు కేటాయించడం లేదని, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం బంద్ చేపడుతున్నట్లు ఏఐఎస్ఎఫ్ నాయకులు వెల్లడించారు. బంద్ ను విజయవంతం చేయాలని పిలపునిచ్చారు. మరో విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ కూడా నేడు బంద్కు పిలుపునిచ్చింది.