నల్ల బియ్యంలో ఎన్నో పోషకాలుంటాయి. ఈ బియ్యంలో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. నియాసిన్, కాల్షియం, మెగ్నిషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలుంటాయి. ఫైబర్ కూడా ఉంటుంది. బ్లాక్ రైస్ లో ఉండే ఆంథోసైనిన్స్ అనే పదార్థం క్యాన్సర్ కారకాలను సమర్ధంగా అడ్డుకుంటుందని పలు పరిశోధనల్లో తేలింది. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఈ బియ్యం తింటే శరీరం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటుంది. బ్లాక్ రైస్ శరీరంలో అదనపు కొవ్వును కరిగిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. రక్తపోటు సమస్యను, కంటిచూపు సమస్యలు రాకుండా కాపాడుతుంది.