గుంతకల్లు పట్టణ పరిధిలోని పాత గుంతకల్లు కురువగేరిలోని ఈఎల్ఎస్ఆర్ తాగునీరు ట్యాంకు ను మున్సిపల్ కమిషనర్ వి. మల్లికార్జున శుక్రవారం తనిఖీలు చేశారు. ట్యాంకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎప్పటికప్పుడు ట్యాంకును శుభ్రం చేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం వార్డులో కార్మికులు చేస్తున్న పారిశుధ్య పనులను పరిశీలంచారు. ఆయనతో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు.