పెనుకొండ పట్టణంలోని 5వ వార్డు సచివాలయం నందు శుక్రవారం జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమానికి పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కొత్త రేషన్ కార్డులు, ప్రధాన ధృవీకరణ పత్రాలను లబ్ధి దారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోఅధికారులు, ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.