ఫ్రిజ్..ఇప్పుడు అందరి ఇళ్లల్లో ఉంది. అయితే దీనిని వాడటంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఫ్రిజ్ లో ఆహార పదార్థాలను, కూరగాయలను ఇరికించి పెట్టకూడదు. సువాసన వస్తువులను, పూలను ఫ్రిజ్ లో పెట్టేటప్పుడు వాటి వాసన బయటకు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. కూరగాయలను కడిగిన తర్వాత, పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాతే వాటిని ఫ్రిజ్ లో పెట్టాలి. పచ్చిమిరపకాయలను తొడిమలు తీయకుండా ఫ్రిజ్ లో పెట్టాలి.