తుఫాన్ గాలులకు రెండున్నరేళ్ల క్రితం విశాఖలోని తెన్నేటి పార్కు వద్ద తీరానికి కొట్టుకువచ్చిన బంగ్లాదేశ్ నౌక ‘ఎంవీ మా’ త్వరలో వినియోగంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిని ఫ్లోటింగ్ రెస్టారెంట్‌గా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ), గిల్‌మెన్ సంస్థ ఒప్పందం చేసుకున్నాయి.