బహిరంగ మార్కెట్లో కిలో రూ. 150కి పైగా అమ్ముడవుతున్న టమాటాను రైతుబజార్లలో కిలో రూ. 50 చొప్పున రాయితీ ధరపై విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. వారానికి నాలుగైదు రోజులు మాత్రమే విక్రయిస్తున్నారు. విశాఖ మొత్తం 13 రైతుబజార్లు ఉండగా ట్రిప్పునకు 750 నుంచి 800 బాక్సుల టమాటా వస్తోంది. శనివారం రైతుబజార్లకు టమాటా రాలేదు. సోమవారానికైనా వస్తుందా? రాదా? అనేది చెప్పలేమని ఎస్టేట్ అధికారులు చెప్పారు.