మహిళలు తమ పెదాలను ఆకర్షణీయంగా మార్చుకునేందుకు లిప్‌స్టిక్ ఎక్కువగా వాడుతుంటారు. అయితే నాసిరకం లిప్‌స్టిక్‌ల వల్ల చాలా అనర్ధాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. షైనింగ్ కోసం వాటిలో కెమికల్స్ వాడుతారు. అంతేకాకుండా ఎక్కువగా లెడ్ ఉపయోగిస్తారు. ఫలితంగా స్త్రీలలో నాడీ వ్యవస్థలో సమస్యలు వస్తాయి. మెదడు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. హార్మోన్ల అసమతుల్యత, పునరుత్పత్తి సమస్యలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.