వినియోగంలో లేని జీ మెయిల్, యూట్యూబ్ ఖాతాలకు సంబంధించి గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. కనీసం రెండేళ్లకు మించి ఉపయోగంలో లేని ఖాతాలను తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇన్ యాక్టివ్ అకౌంట్ పాలసీలో మార్పులు చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే యూజర్లకు వార్నింగ్ మెసేజ్ లు పంపుతోంది. తాజా నిర్ణయంతో వినియోగదారుల డేటా భద్రతను మరింత మెరుగు పరచుకోవచ్చని గూగుల్ చెబుతోంది.