కాలుష్యం, ధూమపానం ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. అయితే కొన్ని చిట్కాలతో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. అల్లం ముక్క వేసి మరిగించిన నీటిని, నిమ్మరసం కలిపిన గోరు వెచ్చని నీటిని పరగడుపున తాగితే ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి. పుదీనా ఆకులను ఉదయాన్నే నమిలితే చక్కటి ఫలితం ఉంటుంది. రోజుకు రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే శ్వాసకోశ సమస్యలు తలెత్తవు.